Train Reverse | స్టేషన్లో ఆగని రైలు.. ప్రయాణికుల గందరగోళంతో వెనక్కి నడిచిన వైనం
Train Reverse | ఒక ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ గందరగోళం నేపథ్యంలో అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు వెనక్కి మళ్లి స్టేషన్‌కు చేరుకున్నది.
పాట్నా: ఒక ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ గందరగోళం నేపథ్యంలో అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు వెనక్కి మళ్లి స్టేషన్‌కు చేరుకున్నది. (Train Reverse) బీహార్‌లోని సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాప్రా – ఫరూఖాబాద్ మధ్య నడిచే ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి 7 గంటలకు చాప్రా జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. రాత్రి 7.26 గంటలకు మాంఝీ స్టేషన్ వద్ద ఆగాల్సి ఉంది. అయితే ఆ రైల్వే స్టేషన్లో రైలు ఆపడాన్ని లోకో పైలట్ మరిచిపోయాడు. దీంతో ఆ రైలు ఆగకుండా వెళ్లడంతో ఆ స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులు, అక్కడ దిగాల్సిన వారు ఆందోళన చెందారు.
కాగా, ఆ స్టేషన్ దాటి అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు ఒక బ్రిడ్జీపై ఆగింది. అనంతరం లోకో పైలట్, గార్డు జరిగిన పొరపాటును ఆ స్టేషన్ మాస్టార్‌కు వివరించారు. ఆ ట్రాక్‌లో ఇతర రైళ్లు రాకుండా సమీపంలోని స్టేషన్ మాస్టార్లను అలెర్ట్ చేశారు. అనంతరం ఆ రైలు వెనక్కి ప్రయాణించి మాంఝీ స్టేషన్‌కు చేరింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆ రైలు సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

