లక్నో: భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అయితే మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కుంభమేళాలో స్నానమాచరించారు. ఈ నేపథ్యంలో క్రికెటర్ పేరును కూడా యోగి ఆదిత్యనాథ్ మార్చినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. (Akhilesh Yadav Takes Dig At CM Yogi) ఉత్తరప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఆయన ఖండించారు. భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా సంగమంలో పవిత్ర స్నానం చేశారని అన్నారు.
కాగా, వాస్తవానికి మొహమ్మద్ షమీ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయలేదు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సంగమం వద్ద నదిలో స్నానమాచరించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అలహాబాద్, ఫైజాబాద్ వంటి అనేక నగరాలు, ల్యాండ్ మార్కుల పేర్లు మార్చిన యోగి ఆదిత్యనాథ్ తాజాగా క్రికెటర్ పేరును కూడా మార్చేశారని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు, మీరు ఒక క్రికెటర్ పేరు కూడా మారుస్తారా?’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
“कुंभ में क्रिकेटर मोहम्मद शमी ने भी स्नान किया..” – सीएम योगी, विधानसभा में
लेकिन ऐसा कब हुआ ? मो. शमी खुद भी ये जानना चाह रहे होंगे!
वैसे सदन से मुख्यमंत्री झूठ तो नहीं बोल रहे होंगे.. लेकिन गलती हो सकती है शायद! pic.twitter.com/0E4rvenUeH
— Devesh Pandey (@iamdevv23) February 19, 2025