శ్రీహరికోట: చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 14వ తేదీన ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలో సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచింగ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి ఎగరనున్నది. ఈ విషయాన్ని ఇవాళ ఇస్రో వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి చంద్రయాన్3 మిషన్‌ను ఈనెల 13వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇటీవల ఇస్రో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఒక రోజు తేడాతో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
Announcing the launch of Chandrayaan-3:
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, SriharikotaStay tuned for the updates!
— ISRO (@isro) July 6, 2023
ఇవాళ ఉదయం ల్యాంచింగ్ ప్యాడ్ వద్దకు రాకెట్ చేరుకున్నది. ఆ ప్రయోగం కోసం పనులు వేగవంతం చేశారు. చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో రెండు రోజుల క్రితమే అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్ వద్ద ఎల్వీఎం-3తో చంద్రయాన్ క్యాప్సూల్‌ను జత చేసినట్లు ఇస్రో తెలిపింది. దీంతో దాదాపు చంద్రయాన్-3 కీలక పనులన్నీ ముగిశాయి.
🚀LVM3-M4/Chandrayaan-3🛰️
Mission: The LVM3 M4 vehicle is moved to the launch pad.The final stage of preparation for the launch commences. pic.twitter.com/fb5eg5nzrn
— ISRO (@isro) July 6, 2023
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3900 కేజీల బరువు ఉంటుంది. తొలుత యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పేలోడ్ క్యాప్సూల్ తయారు చేశారు. ఆ తర్వాత దాన్ని ప్రత్యేక వాహనంలో సతీశ్ ధావన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ రాకెట్‌తో పేలోడ్‌ను అనుసంధానం చేశారు. అన్నీ అనుకూలిస్తే 13వ తేదీన.. లేదంటే 19వ తేదీలోగా చంద్రయాన్3ని ప్రయోగించనున్నట్లు ఇటీవల ఇస్రో చైర్మెన్ సోమనాథ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
రాకెట్ పైభాగంలో ఉన్న పేలోడ్‌లో ల్యాండర్, రోవర్ ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రొపల్సన్ మాడ్యూల్ వల్ల చంద్రుడికి సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ సురక్షితంగా దిగుతుందని, ఆ తర్వాత రోవర్ అక్కడ రసాయనక విశ్లేషణ చేపడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు.