Chandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకూ ఏ దేశం అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా సాధించింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను దించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలానికి చేరిన ప్రజ్ఞాస్ రోవర్ కూడా తన మొదలు పెట్టింది. చందమామ గుట్టు విప్పేందుకు శివశక్తి పాయింట్ ( విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన చోటు)లో తిరుగుతుంది. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 మిషన్ కోసం పెట్టుకున్న మూడు లక్ష్యాల్లో రెండు విజయవంతంగా పూర్తయ్యాయని ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఇస్రో వెల్లడించింది.
Chandrayaan-3 Mission:
Of the 3⃣ mission objectives,
🔸Demonstration of a Safe and Soft Landing on the Lunar Surface is accomplished☑️
🔸Demonstration of Rover roving on the moon is accomplished☑️
🔸Conducting in-situ scientific experiments is underway. All payloads are…
— ISRO (@isro) August 26, 2023
జాబిల్లిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో పాటు.. చందమామ ఉపరితలంపై రోవర్‌ను నడిపించడం విజయవంతంగా పూర్తయ్యిందని ఇస్రో తన ట్వీట్ (ఎక్స్)లో పేర్కొంది. మూడో లక్ష్యమైన శాస్త్రీయ పరిశోధనల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తెలిపింది. ప్రస్తుతానికి అన్ని పేలోడ్లు సక్రమంగా పనిచేస్తున్నాయని పేర్కొంది.