మండి: హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు ఒకటో తేదీన క్లౌడ్‌బస్ట్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కులు-మనాలి హైవే( Kullu-Manali Highway) పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నది. ప్రస్తుతం పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాంపూర్‌లో క్లౌడ్‌బస్ట్ జరగడం వల్ల ఆరు మంది మరణించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వల్ల… మూడు ప్రాంతాల్లో రూట్లను మూసివేశారు. చండీఘడ్-మనాలీ జాతీయ రహదారిపై రాత్రి రూట్ క్లోజ్ చేశారు. కతౌలా, గోహర్ మీదుగా చిన్న వాహనాలను తరలించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని పంపిస్తున్నారు. రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతం వద్ద.. ఇరు వైపులా పర్యాటకులు నిలిచిపోయారు.
మండీ ఏఎస్పీ సాగర్ చందర్ మాట్లాడుతూ.. హైవేపై ఉన్న 5 మైల్, 6 మైల్ వద్ద రోడ్డును క్లియర్ చేసినట్లు చెప్పారు. కానీ 9 మైల్ వద్ద రోడ్డును రిపేర్ చేసేందుకు చాలా టైం పడుతుందని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం వరకు హైవేను క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. దోడ్ నాలా, జోగిని మాతా ఆలయం రూట్లో ట్రాఫిక్ ఆలస్యంగా వెళ్తోంది. రద్దీని తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్‌ను అమలు చేస్తున్నారు.
#WATCH | Kullu, Himachal Pradesh: Parts of Kullu-Manali Highway washed away in the cloudburst on August 1.
Restoration work is underway. The incident of cloudburst in Rampur left 6 people dead. pic.twitter.com/zFrj1e1KT2
— ANI (@ANI) August 3, 2024