న్యూఢిల్లీ: ప్రసార భారతి బోర్డు చైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ పదవీకాలం ఉన్నప్పటికీ.. మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన సమర్పించిన రాజీనామాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదించింది.
ప్రసారభారతి దేశవ్యాప్తంగా దూరదర్శన్ ప్రసారాలను, ఆకాశవాణి రేడియో సేవల్ని నిర్వహిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి సెహెగల్ను కేంద్రం గత ఏడాది మార్చిలో చైర్‌పర్సన్‌గా నియమించింది.