న్యూఢిల్లీ: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) డైరెక్టర్గా తెలుగువాడైన చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐకు డైరెక్టర్గా ఒక తెలుగువ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి. శ్రీనివాసరావు ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు.
1965 అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించిన శ్రీనివాసరావు అదే ఊరులోని జడ్పీ పాఠశాలలో చదువుకున్నారు. బాపట్ల వ్యవశాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ, ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ చేసిన ఆయన దేశంలోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.