న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిందంబరం సోమవారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల విషయంలో కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలంటూ చురకలంటించారు. ఇతర శతాబ్ది ఉత్సవాల మాదిరిగానే.. ప్రధాని నేతృత్వంలోని మంత్రులు ఇటీవల 100 కోట్ల డోసుల టీకా పంపిణీపై సంబురాలు చేసుకున్నారని చిదంబరం గుర్తు చేశారు.
ఇప్పటికే దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.100 దాటాయని పేర్కొన్నారు. గ్యాస్ ధరలు రూ.1000 దాటితే మరోసారి సంబురాలు చేసుకునే అవకాశం ఉందని ఎద్దేవా చేస్తూ చిదంబరం ట్వీట్ చేశారు. ఆదివారం వరకు వరుసగా ఐదు రోజుల పాటు దేశంలో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59, డీజిల్ రూ.96.32 పలుకుతోంది.
PM Modi led his Ministers in celebrating 100 crore vaccinations.
— P. Chidambaram (@PChidambaram_IN) October 25, 2021
He should also lead by example in celebrating other centenaries: Petrol crossed Rs 100 per litre a few weeks ago and now Diesel has crossed Re 100 per litre.