నీట్-యూజీ, యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు పూనుకుంది. జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ని ఈ పదవి నుంచి తొలగించింది. ఆయనను పర్సనల్, ట్రైనింగ్ విభాగంలో వెయిటింగ్లో ఉంచింది.
ప్రస్తుతం ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటీపీఓ) చైర్మన్, ఎండీగా ఉన్న ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కొత్త డీజీ నియామకం వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.