IndiGo | దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, వాటిని పాటించడంలో ఇండిగో (IndiGo) కంపెనీ ఉదాసీనత.. వెరసి దేశీయ విమాన ప్రయాణికులకు గడిచిన నాలుగు రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదోరోజైన శనివారం కూడా దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ దాదాపు 500కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. సంస్థ సీఈవో (IndiGo CEO) పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ (Pieter Elbers)ను తొలిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇండిగో అధికారులకు కేంద్ర విమానయాన సంస్థ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం నిర్వహించిన సమావేశానికి తప్పనిసరిగా రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇండిగోపై భారీగా ఫైన్ వేసేందుకు కూడా కేంద్రం సిద్ధమైనట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.
Also Read..
IndiGo | ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ ధరల అడ్డగోలు పెంపుపై కేంద్రం ఆగ్రహం
IndiGo | సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం.. విమానాల రద్దుపై పిటిషన్ దాఖలు
Indian Railways | ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం