IndiGo : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో నెలకొన్న సంక్షోభం, విమానాల రద్దుతో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పలు విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న వేళ సమస్య మూలాలు తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి విచారణ (High Level Enquiry)కు ఆదేశించింది. అంతేకాదు ప్రయాణికులు, వారి ఆత్మీయుల సౌలభ్యం కోసం 24×7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
ఇండిగో విమానయాన సంస్థలో గత రెండు రోజులుగా విమాన సర్వీస్‌లు వేళకు నడవడం లేదు. శుక్రవారం సైతం 500 సర్వీస్‌లను సంస్థ రద్దు చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే అన్ని దేశీయ విమానాలు ఇవాళ అర్ధరాత్రి వరకూ రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. యాణికుల అవస్థలు గమనించిన కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థలో నెలకొన్న సమస్యలను నిగ్గు తేల్చేందుకు శుక్రవారం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలా హఠాత్తుగా విమానాల రద్దుకు దారితీసే పరిణామాలను నియంత్రించేందుకు అవసరమైన సూచనలు చేయనుంది విచారణ సంఘం.
On the Indigo flight cancellation issue, Civil Aviation Minister Ram Mohan Naidu (@RamMNK) says, flight schedules will begin to stabilise and return to normal by tomorrow.@MoCA_GoI has established a 24×7 Control Room (011-24610843, 011-24693963, 096503-91859).
Government has… pic.twitter.com/Q9hbOtwvLd
— All India Radio News (@airnewsalerts) December 5, 2025
ప్రయాణికులకు తాజా సమాచారం అందివ్వడం కోసం 24×7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేసింది. సందేహాల నివృత్తి కోసం 011-24610843, 011-24693963, 096503-91859 నంబర్లకు డయల్ చేయాలని సూచించింది. అంతేకాదు విమానాశ్రయాల్లో నిరీక్షిస్తున్న ప్రయాణికుల భోజనం, వసతి సౌకర్యాల బాధ్యత ఇండిగో సంస్థదేనని కేంద్రం స్పష్టం చేసింది. పౌర విమానయాన సంస్థ (Ministry of Civil Aviation) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ విమానాల సర్వీస్‌లను క్రమబద్దీకరించడంపై గురి పెట్టింది.
ఇండిగోలో నెలకొన్న సంక్షోభంతో విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో ప్రయాణికుల విమాన ప్రయాణం మరింత భారంగా మారింది. ఇవాళ ఢిల్లీ-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గంలో విమాన టికెట్ ధర ఏకంగా రూ.60 వేలుగా (రౌండ్ ట్రిప్) ఉంది. అదే వన్‌వే అయితే రూ.35,000గా చూపిస్తోంది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఇది ఒకటి. దీంతో విమాన టికెట్ ధరలను విమానయాన సంస్థలు భారీగా పెంచాయి.
Indigo staffs are not helpful
One staff has sent the passengers to gate 34, saying @IndiGo6E manager is there to answer.
When we reached the gate, it was empty and CISF personnel informed that the indigo manager ran away from the place due to repeated questioning by passengers pic.twitter.com/zOsYPeu5i6— Dr Mohamed Khader Meeran (@Lightoftrichy) December 4, 2025
హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై సహా ఇతర నగరాలకు విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్ఠంగా రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. సాధారణ సమయాల్లో రూ.6-10 వేల మధ్య ఉండే ధరలు ఇంత భారీగా పెరగడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విదేశాలకు వెళ్లే విమానాలకు కూడా ఇంత టికెట్ ధర ఉండదంటూ వాపోతున్నారు. కొందరు ప్రయాణికుల తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.