న్యూఢిల్లీ : దేశంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు తీవ్రమవుతున్న తరుణంలో ఖరీఫ్‌లో పంట బీమా పరిధిని విస్తరించాలని కేంద్ర ఆర్థిక శాఖ బీమా సంస్థలను ఆదేశించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) కింద రైతుల నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని కోరింది.
రుతు పవనాల మందకొడి కారణంగా దిగుబడులు తగ్గి, ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ర్టాల్లోని 315 జిల్లాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నందున, ఆయా జిల్లాల్లో బీమా నమోదును మరింతగా పెంచాలని ప్రభుత్వం సూచించింది.