న్యూఢిల్లీ: దేశీయంగా రెండు నూక్లియర్ సబ్మెరైన్ల తయారీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.45 వేల కోట్ల వ్యయంతో ఈ రెండు నూక్లియర్ సబైమెరైన్లను విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించనున్నారు.
ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థలు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకూ కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లోనే అమెరికా ప్రభుత్వంతో దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు.