న్యూఢిల్లీ : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చైర్‌పర్సన్‌గా డాక్టర్ అభిజాత్ సేఠ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయ న ప్రస్తుతం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్‌కు చీఫ్‌గా పని చేస్తున్నారు.
నీట్-పీజీ ఆగస్టులో జరుగుతుంది కాబట్టి ఈ పదవిలో ఆయన మరికొన్ని నెలలపాటు కొనసాగుతారు. ఎన్ఎంసీ చైర్పర్సన్ పదవికి డాక్టర్ బీఎన్ గంగాధర్ నిరుడు అక్టోబరులో రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. తగిన అభ్యర్థి లభించకపోవడంతో ఆ పదవిలో గంగాధర్ ఇప్పటి వరకు కొనసాగారు.