NEET | ‘ నీట్’ అర్థరహితమని కేంద్రం అంగీకరించింది: ఎంకే స్టాలిన్
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ కటాఫ్‌ను జీరోకు తగ్గించడం ద్వారా, నీట్ ప్రయోజనం సున్నా అని కేంద్రం కూడా అంగీకరించిందని ఎద్దేవా చేశారు.
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ 2023కు సంబంధించి అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ను జీరోకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీఎం ఎంకే స్టాలిన్ దీనిపై గురువారం స్పందించారు. నీట్‌కు ఎలాంటి విలువ లేదని, దీని ప్రయోజనం సున్నా అని కేంద్రం కూడా అంగీకరించిందని ఎద్దేవా చేశారు. నీట్ పీజీ కటాఫ్‌ను జీరోకు తగ్గించడం ద్వారా, నీట్ అర్థరహితమని కేంద్ర ప్రభుత్వం గ్రహించిందని అన్నారు. నీట్ వల్ల కేవలం కోచింగ్ సెంటర్లు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని మరోసారి విమర్శించారు. నీట్‌కు మెరిట్‌తో సంబంధం లేదన్నది తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని గుర్తు చేశారు.
కాగా, తమిళనాడు ప్రభుత్వం తొలి నుంచి నీట్‌ను వ్యతిరేకిస్తున్నది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను రద్దు చేసింది. యూపీయే ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు ప్రతిపాదనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్లు కల్పిస్తున్నది. అయితే నీట్ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఆమెదించిన బిల్లును రాష్ట్రపతి ముర్ము ఇంకా ఆమోదించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Accepts
- Centre
- CM MK Stalin
- jibe
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

