న్యూఢిల్లీ: ఈ నెల 20న నిర్వహించాలనుకున్న దేశవ్యాప్త సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్ల సంయుక్త వేదిక గురువారం సమావేశమైంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బాధ్యతాయుతమైన దేశభక్తులుగా సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ, కార్మికుల చట్టబద్ధ డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న సమ్మె చేస్తామని ప్రకటించింది.