న్యూఢిల్లీ : నెల క్రితమే సాధారణ బియ్యం ఎగుమతులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. టన్నుకు 1200 డాలర్ల(సుమారు రూ.99,0 60) లోపు ధర పలికే బాస్మతి బియ్యం ఎగుమతులను అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఎగుమతులకు సంబంధించి కాంట్రాక్టులను రిజిస్టర్ చేయవద్దని వాణిజ్య ప్రోత్సాహక మండలి ఏపీఈడీఏను ఆదేశించించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా ఆదేశాల నేపథ్యంలో టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ ఉన్న ఒప్పందాలు నిలిచిపోతాయి. తాజాగా ఉప్పుడు బియ్యం (పారాబాయిల్డ్) ఎగుమతులపై 20 శాతం పన్ను విధిస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.