న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్‌ను సవరించాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. సింథటిక్, ఆథెంటిక్ కంటెంట్ మధ్య తేడాను యూజర్లు గుర్తించేందుకు వీలుగా లేబులింగ్, ప్రామినెంట్ మార్కర్స్లను తప్పనిసరి చేస్తూ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది.
ప్రధాన సామాజిక మాధ్యమాల వేదికలకు అత్యధిక జవాబుదారీతనం ఉండాలని పేర్కొంది. ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్స్, కృత్రిమంగా తయారు చేసిన కంటెంట్ వల్ల యూజర్లకు హాని జరగకుండా కళ్లెం వేయడం కోసం ఈ సవరణలను ప్రతిపాదించింది.