బెంగాల్ మాజీ సీఎస్‌పై కేంద్రం గుస్సా

- విపత్తు నిర్వహణ చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ
- మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
- ఖండించిన తృణమూల్
న్యూఢిల్లీ/కోల్‌కతా, జూన్ 1: ‘యాస్’ తుఫాన్ సమీక్షా సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం, మమత సర్కారు మధ్య మొదలైన వివాదం కీలక మలుపులు తిరుగుతున్నది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారిన పశ్చిమబెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్కు కేంద్రం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 (సెక్షన్ 51(బీ)) కింద సమన్లు జారీ చేసినట్టు వెల్లడించింది. ఢిల్లీకి డిప్యుటేషన్‌పై రావాల్సిందిగా జారీ చేసిన ఆదేశాలకు స్పందించకపోవడంతో బంధోపాధ్యాయ్కు ఈ నోటీసులు జారీ చేసినట్టు వివరించింది. దీనిపై మూడు రోజుల్లోగా సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు, బంధోపాధ్యాయ్కి షోకాజ్ నోటీసులు జారీచేయడం చట్టవిరుద్ధమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. ఏ నిబంధన ప్రకారం విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద నోటీసులు జారీచేశారని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వంపై కేంద్రానిది ప్రతీకారచర్యేనని మండిపడ్డారు.
అసలేమైంది?
బెంగాల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన ‘యాస్’ సమీక్షా సమావేశానికి మమత, బంధోపాధ్యాయ్ ఆలస్యంగా రావడంతో వివాదం తలెత్తింది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం.. ఢిల్లీకి డిప్యూటేషన్‌పై రావాలని ఆయనను ఆదేశించింది. కానీ ఆయన రిపోర్ట్ చేయలేదు. దీంతో షోకాజ్ నోటీసులను పంపింది.
ధిక్కరిస్తే రెండేండ్ల జైలు!
కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వ అధికారులు.. విపత్తు నిర్వహణ చట్టం, 2005 సెక్షన్ 51(బీ) కింద నోటీసులు జారీచేస్తే తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

