న్యూఢిల్లీ: జనాభా లెక్కల సేకరణకు అత్యాధునిక జియో స్పాషియల్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించబోతున్నది. దీని కోసం వినూత్న చర్యలను చేపట్టినట్లు కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. జనాభా లెక్కల సేకరణకు సన్నాహాల్లో భాగంగా మ్యాపింగ్ కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొంది.
రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు/తాలూకాలు, గ్రామాలు, పట్టణాలు, వార్డులు వంటివాటి మ్యాపులను ఆధునికీకరించినట్లు వెల్లడించింది.