ముంబై: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను చంపకూడదన్న ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఫరూక్ అబ్దుల్లా ప్రకటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. శనివారం బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్‌లో అత్యున్నత వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా. జీవితమంతా జమ్ముకశ్మీర్ ప్రజలకు సేవ చేశారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీపై నాకు ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకుడు ఏదైనా ప్రకటన చేస్తే, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించాలి. ఆ పరిస్థితిని ఎలా పరిష్కరించవచ్చన్న దానిపై కసరత్తు చేయాలి’ అని అన్నారు.
మరోవైపు ఫరూక్ అబ్దుల్లాపై బీజేపీ నేత రవీందర్ రైనా మండిపడ్డారు. ఈ ఉగ్రవాదం పాకిస్థాన్ నుంచి వస్తోందని ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ‘ఈ ఉగ్రవాదం పాకిస్థాన్ నుంచి వస్తోందని ఫరూక్ అబ్దుల్లాకు తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో దర్యాప్తు చేయడానికి ఏముంది? జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడులతో పాకిస్థాన్‌కు, ఉగ్రవాద సంస్థలకు ప్రమేయం ఉందని ఆయనకు తెలుసు. మన సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలకు మనమంతా మద్దతివ్వాలి. మానవత్వపు శత్రువులైన ఇలాంటి వారిపై ఐక్యంగా పోరాడాలి’ అని అన్నారు.
Baramati, Maharashtra: NCP-SCP chief Sharad Pawar says “Farooq Abdullah is the tallest personality of the Jammu and Kashmir…He spent his life serve the people of Jammu and Kashmir. I have no doubt about his integrity and honesty. If such a leader is making any statement then… https://t.co/eatwW5cS79 pic.twitter.com/kZe7wcckSL
— ANI (@ANI) November 2, 2024