న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఓ సందేశాన్ని పంపింది. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతలతో కేంద్ర ప్రభుత్వ అధికారులు శనివారం సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు.
అనంతరం రైతు నేత కాకా సింగ్ కోట్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై తాము చర్చిస్తామని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్ ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలుసుకున్నారు.