న్యూఢిల్లీ, జూలై 5: స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం వంట పాత్రలకు కేంద్ర ప్రభుత్వం ఐఎస్ఐ గుర్తును తప్పనిసరి చేసింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే చర్యల్లో భాగంగా జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఐఎస్ఐ మార్క్ లేని స్టీల్, అల్యూమినియం వంట పాత్రల తయారీ, ఎగుమతి, అమ్మకాలు, పంపిణీ, నిల్వ, ప్రదర్శనపై నిషేధం ఉందని భారత ప్రమాణాల సంస్థ(బీఐఎస్) తెలిపింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన వారిపై జరిమానాలు విధిస్తామని చెప్పింది. వంట పాత్రల తయారీకి సంబంధించి బీఐఎస్ తాజాగా కొన్ని ప్రమాణాలు రూపొందించింది. వీటిలో పాత్రల తయారీకి కావాల్సిన ముడి సరుకు, డిజైన్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.