న్యూఢిల్లీ: రైల్వే బోర్డు చైర్మన్గా సతీశ్ కుమార్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) అధికారి. ఈ బోర్డు చరిత్రలో చైర్మన్, సీఈఓ పదవిని చేపట్టబోతున్న తొలి దళితునిగా ఆయన రికార్డు సృష్టించారు. రైల్వే బోర్డు ప్రస్తుత చైర్పర్సన్, సీఈఓ జయ వర్మ సిన్హా ఈ నెల 31న పదవీ విరమణ చేస్తారు. వచ్చే నెల 1 నుంచి సతీశ్ కుమార్ ఆ బాధ్యతలను చేపడతారు. ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.