న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఆన్లైన్ స్నేహాల జోలికి పోవద్దని, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయవద్దని కేంద్ర బలగాలు (సీపీఎఫ్) తమ సిబ్బందికి ఆదేశాలు జారీచేశాయి. దీనివల్ల హనీట్రాప్ ముప్పు పెరుగుతుందని, సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని హెచ్చరించాయి. యూనిఫామ్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని, తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో స్నేహం చేయొద్దని స్పష్టం చేశాయి. ఈ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందికి ఆదేశాలు జారీచేశాయి. కాగా, భారత సైన్య రహస్య సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నాడని బీహార్‌కు చెందిన భక్త్బాన్షీ ఝా(36)ను కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది.