Center Vs Delhi Govt | కేంద్రం ఆర్డినెన్స్‌పై పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి సూచిస్తాం : సుప్రీంకోర్టు
Center Vs Delhi Govt | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతపై కేజ్రీవాల్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.
Center Vs Delhi Govt | కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ఆప్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతపై కేజ్రీవాల్ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ రాజ్యాంగ ధర్మాసనానికి సూచించనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ.. వాదనలు వినేందుకు కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
అయితే, ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ధర్మాసనం సూచనలను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. మరోవైపు డీఈఆర్సీ (ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), ముఖ్యమంత్రి కలిసి కూర్చుని డీఈఆర్సీ చైర్పర్సన్ పేరుపై నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

