న్యూఢిల్లీ, జూలై 8: వచ్చే ఏడాది (2026) హజ్ యాత్రకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నది.
దరఖాస్తుకు సంబంధించి మార్గదర్శకాలను, అండర్టేకింగ్స్ను దరఖాస్తుదారులు క్షుణ్నంగా చదవాలని కేంద్రం తెలిపింది. ‘దరఖాస్తు చివరితేదీ లేదా అంతకు ముందు జారీచేసిన మెషిన్-రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్ట్పోర్ట్ను కలిగివుండటం తప్పనిసరి. పాస్పోర్ట్ కనీసం 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు కలిగివుండాలి’ అని పేర్కొన్నది.