హైదరాబాద్ : భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జనవరిలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. త్రివిధ దళాల(వాయుసే, ఆర్మీ, నౌకాదళం) తొలి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ఆయన పదవీకాలం 2022, జనవరితో ముగియనుంది. అంతలోనే ఈ ప్రమాద ఘటన జరగడం చాలా దురదృష్టకరమని పలువురు భావిస్తున్నారు.
మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జనవరిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు.