న్యూఢిల్లీ: సీబీఎస్ఈ సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలు తదితర అంశాల్లో తప్పు దోవ పట్టించే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీబీఎస్ఈ సోమవారం విద్యార్థులను హెచ్చరించింది. వార్తలను సరి చూసుకోకుండా ప్రచురించే ఆన్లైన్ పోర్టళ్లను నమ్మొద్దని సూచించింది. ‘మా సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాల గురించి కొన్ని పోర్టళ్లు, వెబ్సైట్లు కాలం చెల్లిన లింకులను, ధ్రువీకరించుకోని వార్తలను ప్రచురిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను తాజా సమాచారం అందిస్తున్నట్టు అవి తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయి’ అని సీబీఎస్ఈ పేర్కొంది. వాటిని నమ్మి గందరగోళానికి గురి కావొద్దని సూచించింది.