న్యూఢిల్లీ, ఆగస్టు 6: పాఠశాలల్లో విద్యార్థుల కనీస హాజరు శాతంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో జరిగే బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10, 12 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 75 శాతం హాజరు ఉండాలని స్పష్టం చేసింది.
వైద్యపరమైన అత్యవసర స్థితి, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు, ఇతర ముఖ్యమైన అవసరాల నిమిత్తం 25 శాతం హాజరుకు మినహాయింపు ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాంటప్పుడు దానిని నిర్ధారించే పత్రాలను విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రాతపూర్వక విజ్ఞప్తి లేకుండా తీసుకునే సెలవును అనధికార గైర్హాజరుగా భావిస్తారు. స్కూల్ యాజమాన్యాలు ప్రతిరోజు హాజరుపట్టీలను అప్డేట్ చేయాలి. వాటిపై సంబంధిత తరగతి టీచర్, అధికార ప్రతినిధి సంతకం తప్పనిసరిగా ఉండాలి.