సీబీఎస్ఈ పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం: కేంద్రం
CBSE board exams: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలను ఎందుకు రద్దు చేయకూడదని ఈ సందర్భంగా న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది.
‘ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలపై సమగ్ర వివరాలు కావాలని మేం కోరడం లేదు. కానీ గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా నిర్ణయం తీసుకుంటే మంచిదని పిటిషనర్ భావిస్తున్నారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఒకవేళ గతేడాది విధానాలకు వ్యతిరేకంగా ఉంటే గనుక అందుకు స్పష్టమైన కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది’ అని కోర్టు కేంద్రానికి సూచించింది.
దీనిపై కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘పరీక్షలపై ప్రభుత్వం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల గురువారం వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నా. ఆ రోజున తుది నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని చెప్పారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు.. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి చిల్లర ప్రసంగంపై హరీశ్‌రావు ఫైర్
Land Scam | మాజీ డీజీపీ భూమికి ఎసరు.. 4.27 ఎకరాల పట్టాభూమి రియల్టర్ పేరు పైకి!
KTR | 5 లక్షల కోట్ల అవినీతి.. రేవంత్‌రెడ్డి దందాలను సొంత ఎమ్మెల్యేలే బయటపెడుతున్నరు: కేటీఆర్
Horoscope | 20-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
Revanth Reddy | ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్..తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

