న్యూఢిల్లీ: స్కాన్ చేసిన 12వ తరగతి జవాబు పత్రాలను పొందేందుకు గడువును ఒక రోజు పొడిగించినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం వెల్లడించింది. తమ వెబ్సైట్లో సాంకేతిక సమస్యల వల్ల విద్యార్థులు స్కాన్ చేసిన జవాబు పత్రాలు పొందడానికి విధించిన మే 22వ తేదీ గడువును మే 23 వరకు పొడిగించినట్టు సీబీఎస్ఈ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కాగా, దీని కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు లాగిన్, దరఖాస్తుల లింక్లు పనిచేయకపోవడం, పేమెంట్ కాకపోవడం వంటి పలు సాంకేతిక సమస్యలు రావడంతో బోర్డుకు ఫిర్యాదు చేశారు. స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 26 నుంచి 29 వరకు వాటిని ఆన్లైన్లో పొందవచ్చునని అధికారులు తెలిపారు.