CBSE : సీబీఎస్ఈ 12వ తరగతి ఆన్‌స్క్రీన్ మార్కుల కేటాయింపులో తీవ్ర గందరగోళం, అవకతవకలపై ఏకసభ్య కమిషన్‌తో విచారణకు ఆదేశించిన కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నందున చైర్ పర్సన్ రాహుల్ సింగ్‌పై బదిలీ వేటు వేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి లొఖాండే ప్రశాంత్ సీతారామ్ (Lokhande Prashant Sitaram)ను కొత్త అధ్యక్షుడిగా కేంద్రం నియమించింది. హిమాన్షు గుప్తా స్థానంలో బోర్డు కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాల్లో ఉపయోగించే ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో పొరపాట్లు తలెత్తడం, భారీగా అవకతవకల నేపథ్యంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావున విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు కఠిన చర్యలకు డిమాండ్ చేయడంతో ఎస్ రాధా చౌహన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. చైర్ పర్సన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలపై వేటు వేసింది.
Lokhande Prashant Sitaram, IAS (AGMUT 2001), appointed Chairperson, CBSE. pic.twitter.com/8rxUc0Ax3u
— Bureaucrats Media (@MBureaucrats) June 2, 2026
క్యాబినెట్ అప్రూవల్ కమిటీ 2001 బ్యాచ్ అగ్మట్ (AGMUT) కేడర్ ఐఏఎస్ అధికారి లొఖాండే ప్రశాంత్ సీతారామ్‌ను నూతన చైర్ పర్సన్‌గా నియమించింది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన రాహుల్ సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2008 ఐఆర్ఎస్ అధికారి అయిన వరుణ్ భరద్వాజ్ సీబీఎస్ఈ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర స్టాఫింగ్ పథకంలో భాగంగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 19వ తేదీ వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.