న్యూఢిల్లీ: జెనీవాలో భారత శాశ్వత కమిషన్‌లోని ఓ మాజీ అకౌంటెంట్ దాదాపు రూ.2 కోట్ల నిధులను సొంత ఖాతాలోకి మళ్లించి అవినీతికి పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితుడు మోహిత్ నిరుడు డిసెంబర్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా చేరాడు. భారత కార్యాలయానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో ఖాతాలున్నాయి.
వాటి నిర్వహణను అతడికి అప్పిగించారు. చెల్లింపుల కోసం కొన్ని క్యూ ఆర్ కోడ్లను ఉపయోగిస్తుండగా.. మోహిత్ నకిలీ కోడ్లను సృష్టించి ఏడాది కాలంలో రూ.2 కోట్లను తన ఖాతాలోకి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు.