దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు బుధవారం మధ్యాహ్నం మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకున్నాయి.
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దర్యాప్తు బాధ్యతను స్వీకరించిన వెంటనే సీబీఐ ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపింది. ఇక కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి చేరుకున్న అనంతరం సీబీఐ అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తును తాము చేపట్టామని, దర్యాప్తు ప్రారంభమైందని వెల్లడించారు.
ఢిల్లీ నుంచి ఎఫ్ఎస్ఎల్, వైద్య బృందాలు ఆస్పత్రికి చేరుకున్నాయని ఆయన చెప్పారు. ఇక కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని సాయంత్రంలోగా, ఇతర డాక్యుమెంట్లను బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
Read More :