Kota Srinivasa Rao | కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఈ పేరు వింటేనే తెలుగు సినిమా కొత్త విలనిజం గుర్తొస్తుంది. క్యారెక్టర్స్ పరంగా, డైలాగ్ డెలీవరి పరంగా ఈ విలక్షణ నటుడు చేయని ప్రయోగం అంటూ ఏమీ లేదు. పాత్ర ఎలాంటిదైనా సరే దానికి తన స్టయిల్‌ను యాడ్ చేస్తూ సరికొత్త మ్యానరిజమ్స్‌తో ప్రజెంట్ చేయడం కోట శ్రీనివాసరావు ప్రత్యేకత. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా వున్న కోట ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల సినిమాలను తగ్గించాడు.
కెరీర్ మొదట్లో స్టేజీపై నాటకాలు ప్రదర్శించే ఈయన.. అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా విలనిజానికి కొత్త భాష్యాన్ని నేర్పాడు. అయితే ప్రారంభంలో సినిమాల అవకాశాల కోసం అందరిలాగే కోట శ్రీనివాసారావు కూడా కష్టపడేవాడు. ప్రాణం ఖరీదు, కుక్క అనే సినిమాల్లో చిన్ని చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి, వందేమాతరం సినిమాలో మంచి పాత్రను సంపాందించాడు.
అయితే ఇవన్నీ కాకుండా తను సినీ పరిశ్రమలో పాతుకపోవడానికి కారణమైన సినిమా గురించి కోట ఓ సందర్భంలో చెప్పారు. నా కెరీర్‌కు కీలకమైన సినిమా ప్రతిఘటన (Pratighatana) . ఇది నా కెరీర్‌ను స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. వందేమాతరం సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే. పార్టీ అధ్యక్షుడుగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం.
సోదరి సోదరిమణులారా అని ప్రసగించాల్సిన సీన్ అది. ఇక ఆ డైలాగ్‌ను నా శైలిలో తెలంగాణ యాసలో చెప్పేసరికి టి.కృష్ణ అది బాగా నచ్చింది. అప్పుడు అక్కడ వున్న రచయిత పీఎల్ నారాయణకు చెప్పి నా మీద అదే శైలిలో మరో నాలుగైదు సీన్లు రాయమని చెప్పారు టి.కృష్ణ. రాత్రంతా కూర్చుని నా కోసం ఎనిమిది సన్నివేశాలు ప్రీపేర్ చేశారు. షూటింగ్ పూర్తయింది.. సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా తెచ్చిన పేరు గురించి అందిరికి తెలిసిందే. ఓవర్‌నైట్‌లో ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’ అని చెప్పుకొచ్చారు.
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ