News Click | న్యూఢిల్లీ, అక్టోబర్ 11: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయాస్థ, మరి కొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫారెన్ కంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి విదేశాల నుంచి నిధులు స్వీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైంది. న్యూస్‌క్లిక్ కార్యాలయం, పుర్కాయాస్థ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ‘మా కార్యాలయం, ఎడిటర్-ఇన్-చీఫ్ పుర్కాయాస్థ నివాసంలో సీబీఐ సోదాలు చేపట్టింది. సీబీఐతో కలిపి ఇప్పటి వరకు ఐదు సంస్థలు మాపై దర్యాప్తు చేస్తున్నాయి. మేము కూడా వాటికి సహకరిస్తున్నాం’ అని న్యూస్‌క్లిక్ సంస్థ ట్వీట్ చేసింది.