lie detector test | కోల్‌కతా వైద్యురాలి హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. సీబీఐకి అనుమతిచ్చిన హైకోర్టు
lie detector test | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ విన్నపానికి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ (lie detector test ) నిర్వహించనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ విన్నపానికి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నిందితుడు సంజయ్ రాయ్‌కు మంగళవారం లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆగస్ట్ 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. హాస్పిటల్ సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, ఆ హాస్పిటల్లో వాలంటీర్‌గా పని చేస్తున్న సంజయ్ రాయ్‌ను నిందితుడిగా అనుమానించి పోలీసులు అరెస్ట్ చేశారు. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించడానికి ఆసుపత్రి వెనుక ఉన్న ప్రదేశానికి అతడు వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ పోర్న్ చూసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు అదే రోజు రాత్రి సంజయ్ రాయ్ చాలాసార్లు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి అతడు ప్రయత్నించినట్లు చెప్పారు. సంఘటనా స్థలంలోని రక్తం మరకలను కడిగేందుకు సంజయ్ రాయ్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుంచి అతడు బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

