బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 11:04:49

ఎఫ్‌బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అన‌లిటికాపై సీబీఐ కేసు

ఎఫ్‌బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అన‌లిటికాపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: ఫేజ్‌బుక్ యూజ‌ర్ల డేటా చోరీ ఆరోప‌ణ‌ల‌పై బ్రిట‌న్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అన‌లిటికా ఏజెన్సీపై సీబీఐ కేసు న‌మోదు చేసింది. సుమారు 5.62 ల‌క్ష‌ల భార‌తీయ ఎఫ్‌బీ యూజ‌ర్ల డేటాను కేంబ్రిడ్జ్ అన‌లిటికా అక్ర‌మ రీతిలో సేక‌రించినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ్లోబ‌ల్ సైన్స్ రీస‌ర్చ్‌(జీఎస్ఆర్ఎల్‌) అనే మ‌రో కంపెనీ కూడా డేటా చోరీకి పాల్ప‌డిన‌ట్లు సీబీఐ త‌న కేసులో న‌మోదు చేసింది.  ఫేస్‌బుక్ ‌- కేంబ్రిడ్జ్ అన‌లిటికా డేటా చోరీ కేసులో సీబీఐ విచార‌ణ జ‌రుగుతుంద‌ని కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కూడా తెలిపారు.

సీబీఐ విచార‌ణ ప‌ట్ల సోష‌ల్ మీడియా కంపెనీ ఫేస్‌బుక్ స్పందించింది.  గ్లోబ‌ల్ సైన్స్ కంపెనీ అక్ర‌మంగా భార‌తీయ యూజ‌ర్ల డేటాను సేక‌రించింద‌ని,  ఆ డేటాను కేంబ్రిడ్జ్ అన‌లిటికాతో షేర్ చేసిన‌ట్లు ఎప్‌బీ చెప్పింది. ఆ  తర్వాత ఆ డేటాతో భార‌త్‌లో ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది.  కేంబ్రిడ్జ్ అన‌లిటికా అక్ర‌మ రీతిలో డేటాను సేక‌రించిన‌ట్లు ప‌లు కంపెనీలు 2018లో ఆరోప‌ణ‌లు చేశాయి. ఆ ఆరోప‌ణ‌ల ఆధారంగా కేంబ్రిడ్జ్ అన‌లిటికాతో పాటు జీఎస్ఆర్ఎల్‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టింది.  


VIDEOS

logo