దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు బుధవారం మధ్యాహ్నం మహిళా వైద్యురాలి హత్యాచార ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకున్నాయి.
కోల్‌కతా హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. దర్యాప్తు బాధ్యతను స్వీకరించిన వెంటే సీబీఐ ఢిల్లీ నుంచి ప్రత్యేక వైద్య, ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనా ప్రాంతానికి పంపింది. ఇక కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నది. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని సాయంత్రంలోగా, ఇతర డాక్యుమెంట్లను బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. నిర్భయ ఘటన అనంతరం కఠిన చట్టాలు తీసుకురావడంతో పరిస్ధితి మెరుగుపడుతుందని అనిపించినా, కథువా, ఉన్నావ్, హథ్రాస్, లలిత్ పూర్ వంటి ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం విచారకరమని అన్నారు. కోల్‌కతా ఘటన దారుణ ఉదంతమని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు ప్రజలను ఆరోగ్యంగా ఉండేలా శ్రమిస్తుంటే మనం వారి భద్రతను కాపాడలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు