న్యూఢిల్లీ : కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా తమ ఆధార్‌ను వెరిఫికేషన్ చేయించుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు డిసెంబరు 31లోగా ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయించుకోవాలి.
ఈ నిబంధనలను పాటించకపోతే, ప్రస్తుత పాన్ కార్డు డీయాక్టివేట్ కావచ్చు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రం వంటి ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలను రుజువుగా చూపి పాన్ కార్డును పొందే అవకాశం ఉండేది.