న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేపట్టాలని ఇవాళ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎస్పీల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఎస్పీ వర్గీకరణ చేపట్టాలని ఇవాళ ఉదయం టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మాన్ని ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం గురించి చర్చించాలని టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింథియా మాట్లాడుతున్న సమయంలో.. ఆయన ముందు ప్లకార్డులను ప్రదర్శించారు. ఎస్సీ వర్గీకరణతో చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.