న్యూఢిల్లీ: విజేతలు భిన్నమైన పనులు చేయరు.. పనులనే భిన్నంగా చేస్తారు.. అనేది మరోసారి నిజమని తేలింది. సంప్రదాయ చదువుకు స్వస్తి పలికాడు. యూ ట్యూబ్‌లో పాఠాలు విని మార్చిలో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2021కు సిద్ధమయ్యాడు. టాప్ ర్యాంకు సాధించాడు. అతడే అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ గుప్తా. క్యాట్‌లో 100 పర్సంటైల్‌ను 9మంది సాధించగా.. అందులో చిరాగ్ ఉన్నాడు. ఇతడు ఫుణెలోని ఐఐఎస్ఈఆర్లో బీఎస్-ఎంఎస్ ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.