జమ్ము: పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్‌లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు.
లష్కరే తాయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఈ ముగ్గురిలో అదిల్ హుస్సేన్ థోకర్ అనంత్‌నాగ్ వాసి కాగా, అలీ భాయ్ అక తల్హా భాయ్, హషీమ్ ముసాల అకా సులేమాన్‌లు పాకిస్థానీలు.