ముంబై (నమస్తే తెలంగాణ) : నేరగాళ్ల చిత్రాలున్న టీ-షర్టులను అమ్ముతున్న పలు ఈ-కామర్స్ సంస్థలపై మహారాష్ట్ర సైబర్ పోలీస్ విభాగం కేసులు నమోదు చేసింది.
దావూద్ ఇబ్రహీం, లారెన్స్ బిష్ణోయ్ చిత్రాలతో ఉన్న టీ-షర్టులు అమ్ముతున్న ఫ్లిప్‌కార్ట్, అలీ ఎక్స్‌ప్రెస్, టీ షాపర్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. క్రిమినల్స్‌ను హీరోలుగా చూపెట్టే చర్యలు యువతపై తీవ్ర చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని ఒక పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.