ఇంఫాల్: ఆన్లైన్ సందేశాలు, చర్చ కార్యక్రమాల ద్వారా భారత్‌కు చెందిన యూకే ప్రొఫెసర్ మణిపూర్‌లో జాతుల మధ్య విద్వేషానికి ఆజ్యం పోస్తున్నారని ఇంఫాల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులతో సదరు ప్రొఫెసర్‌కి సంబంధాలున్నాయని పలువురు స్థానికులు ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం సదరు ప్రొఫెసర్‌ను బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేసే ఉదయ్ రెడ్డిగా గుర్తించారు. ‘మైతీల మత విశ్వాసాలను అవమానించేలా, ఇతర జాతులతో వారికి ఉద్రిక్తతలు పెరిగేలా నిందితుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఇంఫాల్ తూర్పు జిల్లా పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఉదయ్ ఇంతవరకు స్పందించలేదు.