అది అసలే జాతీయ రహదారి. ఓ వ్యక్తి కారుతో ప్రమాదకరంగా స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కారు వేగంగా వెళ్తుండగా ఓ డోర్ తెరిచి విన్యాసాలు చేసేందుకు చూశాడు. కానీ, ఆ కారు అదుపు తప్పింది. డివైడర్పైనుంచి అవతలి రోడ్డుపై ఎగిరిపడి రేలింగ్‌ను ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఘటన చండీగఢ్-సిమ్లా జాతీయ రహదారి (ఎన్‌హెచ్-5)పై జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన డ్రైవర్ కారుతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించాడు. ఇది ప్రమాదానికి దారితీసింది. మరొక కారు డ్యాష్‌బోర్డ్ నుంచి దీన్ని చిత్రీకరించారు. ఈ ఘటనలో పాత తరం హోండా సిటీ తుక్కుతుక్కయిపోయింది. కాగా, ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు హిమాచల్ పోలీసులు డ్రైవర్‌పై ఐపీసీ 279, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
#WATCH | HP: A video went viral showing a car jumping over a divider & colliding with railing on NH-5 in Solan; a resident from Amritsar tried performing stunts while rash driving. Vehicle damaged but driver safe. Case filed u/s 279 of IPC in Dharampur PS: Solan Police (25.07) pic.twitter.com/o5ajWRJuiG
— ANI (@ANI) July 25, 2022