Watch: కారుతో డేంజరస్ స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డ్రైవర్ ఆ కారును రోడ్డుపై వంకరు టింకరుగా నడిపాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు టైరు పేలింది. గాల్లోకి ఎగిరి ఒక పక్కకు రోడ్డుపై పడిన ఆ కారు పలు ముక్కలైంది. ఇది చూసిన పలువురు వాహనదారులు షాక్ అయ్యారు.
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి కారుతో డేంజరస్ స్టంట్ చేశాడు. అయితే అది బెడిసికొట్టింది. దీంతో డివైడర్ను ఆ కారు ఢీకొట్టింది. అనంతరం ఆ కారు ముక్కలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గురువారం ఒక ట్విట్టర్ యూజర్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. 37 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక కారు వేగంగా వెళ్తుంది. అనంతరం డ్రైవర్ ఆ కారును రోడ్డుపై వంకరు టింకరుగా నడిపాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ కారు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు టైరు పేలింది. గాల్లోకి ఎగిరి ఒక పక్కకు రోడ్డుపై పడిన ఆ కారు పలు ముక్కలైంది. ఇది చూసిన పలువురు వాహనదారులు షాక్ అయ్యారు.
కాగా, మరో కారులోని కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను తరుణ్ అనే ట్విట్టర్ యూజర్ గురువారం పోస్ట్ చేశారు. పంజాబ్లోని నవాన్షహర్, ఫగ్వారా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాహనదారులకు సూచించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కార్లతో ఇలాంటి స్టంట్లు, సాహసాలు చేయవద్దని యువతకు సూచించారు.
మరోవైపు ఇలాంటి స్టంట్లు ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని ఒకరు పేర్కొన్నారు. స్టంట్లు చేసే వారికేగాక రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగవచ్చని మరొకరు హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే జోకర్లను కఠినంగా శిక్షించాలని మరికొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.
Drive safe guys: Live road accident video on Punjab's Nawanshahr-Phagwara National Highway, Swift car crashed into divider while doing stunt on the road. pic.twitter.com/MYs7hjijol
— DreamThatWorks 🇮🇳 (@dreamthatworks) February 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

