జైపూర్: వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. (Car runs into camel) అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 9 గంటల సమీపంలో నోహర్ వైపు వేగంగా వెళ్తున్న కారు భుకర్కా గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు ముందు అద్దం ధ్వంసమైంది. దీంతో వాహనం ముందు భాగంలో ఒంటె చిక్కుకుంది. కారు నుంచి బయటకు రాలేక బాధతో అది అరిచింది.
కాగా, ఒక క్రేన్‌ను అక్కడికి రప్పించారు. కారులో చిక్కుకున్న ఒంటెను బయటకు తీశారు. పశువైద్యుడ్ని పిలిపించి ఆ ఒంటెకు చికిత్స అందించారు. మరోవైపు ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. అయితే ఈ సంఘటన వల్ల చాలా భయాందోళన చెందాడు. సమీపంలోని ఆసుపత్రిలో అతడికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు.
అయితే కారులో చిక్కుకున్న ఒంటెను రక్షించే ప్రక్రియ చాలాసేపు కొనసాగింది. దీంతో ఆ రహదారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, కారు ముందు భాగంలో ఒంటె చిక్కుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
राजस्थान : हनुमानगढ़ जिले में ऊंट और कार का एक्सीडेंट। कार की विंड स्क्रीन में फंसा ऊंट, चोटिल हुआ। कार वाले सेफ हैं। pic.twitter.com/IhQPxmF0l9
— Sachin Gupta (@SachinGuptaUP) June 9, 2024