న్యూఢిల్లీ : కారు రిజిస్ట్రేషన్ నంబర్ హెచ్ఆర్88బీ8888 సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో దీనికి రూ.1.17 కోట్లు పలికింది. మన దేశంలో అత్యంత ఖరీదైన కార్ నంబర్ ప్లేట్‌గా ఘనతను సొంతం చేసుకుంది. హర్యానా ప్రభుత్వం వీఐపీ లేదా ఫ్యాన్సీ వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌ను ఆన్లైన్లో వేలం వేస్తూ ఉంటుంది.
అదేవిధంగా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్వహించిన వేలంలో ఈ నంబర్ ప్లేట్‌కు 45 బిడ్స్ వచ్చాయి. ఈ ప్లేట్లోని ఇంగ్లిష్ అక్షరం బీ, అంకె 8 ఒకే విధంగా ఉండటం వల్ల ఎక్కువ మందిని ఆకర్షించింది. బేస్ ప్రైస్ రూ.50,000 నుంచి ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నానికి రూ.88 లక్షలకు చేరింది. చివరికి వేలం ముగిసే సమయానికి రూ.1.17 కోట్లకు చేరింది.